Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..!
ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది.
ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు.
ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ..
కొద్దిగా కంప్యూటర్ టచ్ ఉండి.. కాస్త ప్రాధమిక నైపుణ్యం ఉంటే డేటా ఎంట్రీ వర్క్ బాగుంటుంది. వేగవంతమైన టైపింగ్ నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే డేటా ఎంట్రీ జాబ్ బాగుంటుంది. ఐతే దీని కోసం మంచిగా పనిచేసే కంప్యూటర్ అంతరాయం లేకుండా వచ్చే ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండాలి. రకరకాల ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం లు డేటా ఎంట్రీ జాబ్స్ అందిస్తున్నాయి. ఆ రంగం లో ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ సంపాదించవచ్చు. కాస్త వెబ్ డిజైనింగ్ లో టచ్ ఉంటే వెబ్ బ్లాగింగ్ లో కూడా డబ్బు సంపాదిచొచ్చు. కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్ లో కూడా జాబ్స్ ఉంటాయి. వివిధ ఆన్ లైన్ కంపెనీలు వీటి కోసం పెద్ద మొత్తం సాలరీ ఇస్తూ జాబ్స్ ఇస్తున్నారు.
ఇక ఖాళీగా ఉండి క్రియేటివ్ గా ఆలోచించే మహిళలకు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. హౌస్ వైఫ్స్ యూట్యూబ్ లో ఎడిటింగ్, వీడియో రికార్డింగ్, ఫుడ్ వ్లాగ్ ఇలా అన్నిటిని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. ఇక కొంతమంది ప్రత్యేక ఆర్ట్ క్రాఫ్ లో అనుభవం ఉన్న వారికి హస్తకళలు ద్వారా ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎబ్రాయిడరీ వర్క్, కునలు ఇలా హస్తకళలను తయారు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.
ఇక కొంతమంది మహిళలు బహుబాషాలలో నైపుణ్యం ఉన్న వారు ఉంటారు. అలాంటి వారు ట్రాన్స్ లేషన్ ద్వారా డబ్బులు పొందే ఛాన్స్ ఉంది. అనువాదం కోసం మీరు పనిచేస్తే మంచి డబ్బు వస్తుంది ఫేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఈ అనువాదకులను నియమించుకుంటుంది. దీనికి కూడా మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటుగా విజువల్ అసిస్టెంట్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వర్చువల్ అసిస్టెంట్ ఈమధ్య బాగా పాపులర్ అయ్యింది. ఎవరికైనా అవసరం ఉన్న వారికి అసిస్టెంట్ ఇస్తూ వారి ద్వారా డబ్బు సంపాదించొచ్చు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అపాయింట్ మెంట్ ఇలాంటి అంశాలలో వారికి సహాయం చేస్తే మంచి శాలరీ ఇస్తారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..