Home » BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..
BrahMos Missile

BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Spread the love

BrahMos Missile to Philippines: ర‌క్ష‌ణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవ‌డ‌మే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos సూపర్‌ సోనిక్ క్రూజ్ మిసైల్ ని ఫిలిప్పైన్స్‌కి పంపించింది. 2022లో భారత్, ఫిలిప్పైన్స్ మధ్య కీల‌క‌ ఒప్పందం కుదిరింది. ఈ మిసైల్‌ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిసైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు.

2022లో ఇరు పక్షాల మధ్య కుదిరిన 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెలివరీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలను అభినందించారు. దోమాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈ క్షిపణి మొదటి బ్యాచ్ ఈ రోజు ఫిలిప్పీన్స్‌కు వెళుతోంది. దీనిపై దేశప్రజలందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను” అని  అని మోదీ అన్నారు.

READ MORE  Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

2022లో ఇరుపక్షాల మధ్య కుదిరిన USD 375 మిలియన్ల ఒప్పందంలో భాగంగా భారతదేశం శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను పంపిణీ చేసింది. క్షిపణులతో పాటు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన గ్రౌండ్ సిస్టమ్‌ల ఎగుమతి గత నెలలోనే ప్రారంభమైందని తెలిపారు.

దక్షిణ చైనా సముద్రంలో తరచుగా జరిగే ఘర్షణల కారణంగా మనీలా – చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ కు భార్ మిసైల్స్ ను పంపిణీ చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు చెందిన మూడు బ్యాటరీలను ఫిలిప్పీన్స్ తమ తీర ప్రాంతాల్లో మోహరించి ఈ ప్రాంతంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాపాడుతుంది.

READ MORE  Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రష్యన్ ఫెడరేషన్ కు చెందిన NPO Mashinostroyeniya మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Missile ) ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్షిపణి కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచ స్థాయిలో అగ్రగామి వేగవంతమైన ఖచ్చితత్వ-గైడెడ్ ఆయుధంగా పేరొందిన బ్రహ్మోస్ భారతదేశ నిరోధక సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. భారత సైన్యం 2007 నుంచి అనేక బ్రహ్మోస్ రెజిమెంట్లను తన ఆయుధశాలలో చేర్చుకుంది.

READ MORE  Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..