
BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..
BrahMos Missile to Philippines: రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ని ఫిలిప్పైన్స్‌కి పంపించింది. 2022లో భారత్, ఫిలిప్పైన్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మిసైల్ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిసైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు.2022లో ఇరు పక్షాల మధ్య కుదిరిన 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెలివరీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలను అభినందించారు. దోమాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈ క్షిపణి...