Thursday, February 13Thank you for visiting

IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

Spread the love

హైదరాబాద్: తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వ‌ర‌కు తెలంగాణలోని పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ (IMD Hyderabad ) అంచనా వేసింది.

ఆదివారం నుంచి వర్షాలు

తెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వ‌నుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్ పరిధికి తగ్గే అవకాశం ఉంది.

READ MORE  Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

ఇదిలా వుండగా హైదరాబాద్ నగరంలో కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గురువారం గంటపాటు భారీ వర్షాలు కురిశాయి. తేలికపాటి నుండి మోస్తరు ఉరుములతో కూడిన గాలివానలు కురవడంతో వాతావరణ చల్లబడింది. వర్షాలకు ముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి, మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు, వరంగల్, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటింది. కొత్తగూడెం, జయశంకర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ వంటి జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి, ఒక్కొక్కటి 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

READ MORE  TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

కాగా  IMD Hyderabad ప్రకారం ఏప్రిల్ 20 నుంచి  వరకు వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. . కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..