Home Viral Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ...

Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..

0
13
Bengaluru Metro
Spread the love

Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత “చాలా మురికిగా” ఉన్నాయని భావించారు.

తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు.

వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు మాత్రమే ఉన్నాయి.. మెట్రోలోకి బ‌ట్ట‌ల సంచి తీసుకురావ‌డంపై నిషేధం ఏమీ లేదు. మరి ఎందుకు అత‌డిని అడ్డుకుంఉన్నారు అని ప్ర‌శ్నించాడు. మెట్రో కేవలం వీఐపీ ప్రయాణానికి మాత్రమేనా?.. అది ప్రజా రవాణా కాదా అని ఆ వ్యక్తి అధికారులను నిల‌దీశాడు. ఎంట్రీ ఇవ్వడానికి క్యూలో ఉన్న మరికొందరు కూడా రైతుకు మద్దతుగా వచ్చి భద్రతా సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నివేదికల ప్రకారం, ఈ సంఘటన ఆన్‌లైన్‌లో కలకలం రేపడంతో బాధ్యుడైన ఆ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను తొలగించిన‌ట్లు తెలిసింది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here