Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్దని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..
Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత "చాలా మురికిగా" ఉన్నాయని భావించారు.తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వస్తువులు తనిఖీ చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్రయాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు.వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు...