UP Thief Falls Asleep | లక్నో: ఉత్తర ప్రవేశ్ రాజధాని లక్నోలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. లక్నో (Lucknow) లోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు.
ఘాజీపూర్ (Ghazipur) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, దొంగతనం చేయాలని లక్ష్యంగా చేసుకున్న ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో సునీల్ పాండేకి చెందినది. బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పాండే ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు, ఇల్లు ఖాళీగా ఉంది. ఉదయం పాండే తలుపు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దొంగలు చొరబడి ఉంటారని వారు భావించారు.
వెంటనే ఘాజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ మంచంపై నిద్రిస్తున్న కపిల్ అనే దొంగ ను గుర్తించారు. అతడిని అరెస్టు చేసి ఐపిసి సెక్షన్ 379 ఎ కింద దొంగతనం కేసు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘాజీపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), వికాస్ రాయ్ తెలిపారు.
Agra Viral Video | మోమోలు తీసుకురాలేదని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
చొరబాటుదారుడు దొంగతనానికి యత్నించి నిద్రమత్తులోకి జారిపోయాడు. “అలమారాలు పగులగొట్టాడు. నగదుతో సహా ప్రతిదీ తీసుకున్నారు. వాష్‌బేసిన్, గ్యాస్ సిలిండర్, గీజర్ తోపాటు ఇతర వస్తువులను తీసుకొని రెండు గోనె సంచుల్లో భద్రపరుచుకున్నాడు. ” అని అధికారి తెలిపారు. “బ్యాటరీని తొలగించే ప్రయత్నంలో అతను మత్తులో కుప్పకూలిపోయి నిద్రపోయాడు” అని అధికారి తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..