How to check poll results on ECI website | యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటరు తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలపై అప్‌డేట్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి.
Lok Sabha election 2024 results : 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల పోలింగ్ జూన్ 1న, శనివారం ముగిసింది, ఫలితాలు మంగళవారం జూన్ 4న ప్రకటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 19, ఏప్రిల్ 26న ఫేజ్ 2, మే 7న ఫేజ్ 3, మే 13న ఫేజ్ 4, మే 20న ఫేజ్ 5, మే 25న ఫేజ్ 6, జూన్ 1, 2024న చివరి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, భారత ఎన్నికల సంఘం (ECI) X (గతంలో ట్విట్టర్)లో “2024 సాధారణ ఎన్నికల కౌంటింగ్ డే కోసం ఏర్పాట్లు” అనే శీర్షికతో ప్రెస్ నోట్‌ను పోస్ట్ చేసింది.
కౌంటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు , ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల శాసనసభలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4, మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్లను జూన్ 2న ఆదివారం లెక్కించిన విషయం తెలిసిదే.. సిక్కింలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) 32 లో 31 సీట్లను గెలుచుకొని అపూర్వ విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు గాను 46 సీట్లు గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Arrangements for Counting Day of General Elections 2024 pic.twitter.com/72XQbqawVR
— Spokesperson ECI (@SpokespersonECI) June 1, 2024
లైవ్ అప్‌డేట్‌లను ఇలా చెక్ చేసుకోండి..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు (EC) జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కౌంటింగ్ రోజు కోసం అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ECI వెబ్‌సైట్‌లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
అసెంబ్లీ నియోజకవర్గం/పార్లమెంటరీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి/అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నమోదు చేసిన డేటా ప్రకారం కౌంటింగ్ ట్రెండ్‌లు, ఫలితాలు ECI వెబ్‌సైట్‌లో https://results.eci.gov.in/ URLలో అందుబాటులో ఉంటాయి.
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్
Lok Sabha election 2024 results : ఓటర్లు మొబైల్ ఫోన్‌లలోని ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో ఎన్నికల ఫలితాలను కూడా తనిఖీ చేయవచ్చు, దీనిని Android లేదా iOS వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను గూగుల్ ప్లే లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్ ను ఓపెన్ చేయాలి. అందులో గెలిచిన అభ్యర్థులు, , ముందంజలో ఉన్న లేదా వెనుకబడిన అభ్యర్థుల వివరాలను, నియోజకవర్గాల వారీగా లేదా రాష్ట్రాల వారీగా ఫలితాలను తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు.
నియోజకవర్గాల వారీ ఫలితాలను ఎలా చూసుకోవాలి?
ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో, ‘Results” పై క్లిక్ చేయండి లేదా ఈ URLపై క్లిక్ చేయండి. – https://results.eci.gov.in/
సాధారణ ఎన్నికల ఫలితాల (General Election Results) పై క్లిక్ చేయండి
మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి, మీ నియోజకవర్గాన్ని చెక్ చేయండి. ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు? ఎవరు వెనుకబడి ఉన్నారు? అనే వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలు రావడం ప్రారంభించిన తర్వాత నియోజకవర్గాల వారీగా విజేతలు కూడా ఈ పేజీలో డిస్ప్లే అవుతుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..