Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: warangal

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Telangana

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి.1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.మరోవైపు ఎంజీబీఎస్‌...
Railway News | వరంగల్ – సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..
Telangana

Railway News | వరంగల్ – సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..

Railway News | హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  సికింద్రాబాద్‌-వరంగల్‌ మెము (07462), వరంగల్‌-హైదరాబాద్‌ మెము (07463) రైళ్లను రద్దు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో.దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.  రైలు ప్రయాణీకులను దీనిని గమనించాల్సిందిగా కోరారు. అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసారు. అత్యాధునిక కోచ్ లతో  సికింద్రాబాద్ - విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం (12739) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad – Visakhapatnam Garib Rath Express ) రైలు ఇప్పుడు అత్యాధునిక కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐస...
Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..
Telangana

Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు (Warangal Ring Road) కోసం భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతిపాదిత ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ను...
Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..
Local

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach R...
Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..
Trending News

Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్‌’ (Medram app) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భక్తులకు ఒక‌ గైడ్‌గా ఉప‌యోగ‌ప‌డనుంది. ఈ యాప్ సాయంతో జాతర ప‌రిస‌రాల్లోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్ర‌దేశాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు త‌దిత‌ర‌ వివరాలను తెలుసుకోవ‌చ్చు. అలాగే, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసే కేంద్రాలు, అగ్నిమాప‌క‌ కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ను ఈజీగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కాగా నెట్వర్క్ లేకపోయినా ఈ యాప్ ఉప‌యోగించుకోవ‌చ్చు.ఇదిలా ఉండ‌గా ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ మ‌హా జాతర జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఈసారి జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు అమ్...
Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?
Special Stories

Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి..ఆలయ చరిత్ర ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూ...
బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు
Local

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు.అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...
సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
Local, Telangana

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యంWarangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...
ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..
Local

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు.ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ ల...
శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి  శ్రావణ మాసోత్సవాలు
Local

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...