
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పిడుగు.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు
Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతు కూరుకుపోయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరో షాక్ తగిలింది. నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు భారీగా నిధులు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi LG VK Saxena) ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేయడం సంచలనం రేపింది. ఎన్ ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోం కార్యదర్శికి లేఖ రాశారు.అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని AAP ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, అలాగే ఖలిస్తానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి ఖలిస్తానీ గ్రూపుల నుంచి భారీ నిధులు, USD 16 మిలియన్లను పొందినట్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మోస్ట్ వాంటెడ్ ...