BJP | బిజెపి పార్టీ విస్తరణ కార్యక్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు
BJP Offices | భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకు అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజపీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్పటికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్లడించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. బిజెపి దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. 563 పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని బిజేపి ప్రధాన కార్యాలయం పనాజీ శివార్లలో రాజధాని నగరాన్ని ఓల్డ్ గోవాకు కలిపే హైవేకి సమీపంలో ఉంటుంది. డిసెంబర్ 2026 నాటికి కొత...