Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం “అద్భుతం” గా కనిపించిందని తెలిపారు. సునీతా విలియమ్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారతదేశాన్ని చూసిన తన విస్మయపరిచే అనుభవాన్ని పంచుకున్నారు, హిమాలయాలు, శక్తివంతమైన తీరప్రాంతం, ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న నగర దీపాల వలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలు అద్నుభుతంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
“భారతదేశం అద్భుతంగా ఉంది,” అని విలియమ్స్ అన్నారు. సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉన్న భారత్ గొప్ప దేశమని ఆమె కొనియాడారు.. విల్మోర్ సునీతను తన సిబ్బందిని భారతదేశ పర్యటనకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు, ఆమె నవ్వుతూ “ఖచ్చితంగా. మీరు కొంచెం సమయం పట్టవచ్చు.కానీ పర్వాలేదు. మేము మీ అందరికీ కారంగా ఉండే ఆహారం అందిస్తాము, బాగుంటుంది” అని సమాధానం ఇచ్చారు.
కాగా 59 ఏళ్ల వ్యోమగామి, నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి, స్పేస్‌ఎక్స్ (space x) క్రూ-9 మిషన్‌లో భాగంగా భూమికి తిరిగి వచ్చిన తర్వాత వారి మొదటి విలేకరుల సమావేశంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. వీరు ఇరువురు తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలో ఉండి సురక్షితంగా తిరిగి వచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.