Summer Hacks | వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు బయట అడుగు పెడితే ఒక నిప్పుల కొలిమిలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. ఇదే సమయంలో వేసవిలో కరెంట్ కోతలు మరింత ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఎయిర్ కండిషనర్స్ (ఏసీలు), కూలర్లు లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎయిర్ కండిషనింగ్ లేకుండా కూడా వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు. మీ యుక్తితో, మీరు ఈ హీట్‌వేవ్ నుంచి విజయం సాధించవచ్చు. మిమ్మల్ని చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఉపాయాలను అందిస్తున్నాం ఓ లుక్కేయండి..
ఆల్కహాల్, కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి : ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. వేసవిలో అది మీకు మరింత వేడికి గురిచేస్తుంది. మీరు చక్కెర పానీయాలు, మితిమీరిన కెఫిన్‌లకు దూరంగా ఉండాలి. ఇది మిమ్మల్ని మరింత నిర్జలీకరణం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఖుస్ కర్టెన్లను ఉపయోగించండి : ఖుస్ కర్టెన్‌లు లేదా గడ్డి, పీచుతో తయారు చేసిన కర్టెన్లు ఉపయోగించడం వల్ల గదిలో వేడిని తగ్గించవచ్చు. గడ్డితో చేసిన కర్టెన్లు తలుపులు కిటికీలపై వేలాడదీసి వాటిపై నీటితో స్ప్రే చేయాలి. దీనివల్ల కర్టెన్లు ఇంట్లోకి వీస్తున్నప్పుడు బయట ఉన్న పొడి గాలిని చల్లని, తడిగాలిగా మారుస్తాయి. సాధారణంగా కూలర్లలో కూడా ఖుస్ వాడతారు.
పని వేళల్లో మార్పులు చేసుకోండి : మీకు అవకాశం ఉంటే రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో నిద్రపోవాలని కొందరు నిపుణులు సూచిస్తుంటారు. . “బయటికి వెళ్లడం, వ్యాయామం చేయడం లేదా బయట వెళ్లే పనులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే మండుతున్న సూర్యకాంతి వేడి గాలి మిమ్మల్ని నీరసానికి గురిచేస్తాయి.
డీహైడ్రేషన్ కు దూరంగా ఉండండి : మీకు దాహం అనిపించకపోయినా, రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల కోసం లక్ష్యంగా పెట్టుకోండి. పుచ్చకాయ, దోసకాయ, మిలన్ వంటి అధిక నీటి శాతం ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోండి
కాటన్ దుస్తులు ధరించండి : కాటన్ లేదా లెనిన్ వంటి సహజ ఫైబర్‌లతో తయారు చేసిన వదులుగా ఉండే, తేలికైన దుస్తులను ఎంచుకోండి. వేడిని శోషించుకునే ముదురు రంగుల దుస్తులను ధరించవద్దు. సూర్యుని నుండి మీ తలని రక్షించడానికి టోపీని పెట్టుకోండి..
క్రాస్ వెంటిలేషన్ : సహజమైన గాలి ఇంటిలోకి సులభంగా ప్రసరించేందుకు మీ ఇంటికి ఎదురుగా ఉన్న కిటికీలను తెరవండి. ఫ్యాన్ ముందు తడి వస్త్రాలు ఉంచండి. వేలాడదీసిన తడి గుడ్డలు బాష్పీభవనం ద్వారా చల్లని వాతావరణాన్ని సృష్టించగలవు.
చల్లని నీటితో స్నానం : రిఫ్రెష్ షవర్ లేదా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గుతుంది. తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.
పబ్లిక్ ఎయిర్ కండిషన్ : మీ ఇల్లు భరించలేనంతగా వేడిగా ఉంటే, కాసేపు చల్లబరుచుకోవడానికి కొందరు ఎయిర్ కండిషనింగ్ ఉన్న పబ్లిక్ లైబ్రరీ, షాపింగ్ మాల్ లేదా కమ్యూనిటీ సెంటర్‌ను వెళుతుంటారు.
ఇంటి లోపలా, బయట మొక్కలను పెంచండి : ఇంట్లో పెరిగే మొక్కలను పెంచుకోండి.. మొక్కలు నీటి ఆవిరిని విడుదల చేసే భాష్పీబవన ప్రక్రియ ద్వారా గాలిని చల్లబరుస్తాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు తీవ్రమైన హీట్ వేవ్ సమయంలో కూడా చల్లగా హాయిగా ఉండొచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..