
Samsung Galaxy S25 సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ కొన్ని అత్యాధునిక పరికరాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Tri-Fold Phone ) కూడా ఉంది. అదనంగా, శామ్సంగ్ దాని రాబోయే VR హెడ్‌సెట్‌తోపాటు సాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను టీజ్ చేసింది. ఇది సాంసంగ్ నుంచి వచ్చిన ఫోన్లలో అత్యంత తక్కువ మందం ఉన్న ఫోగా చెప్పబడింది. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ కంపెనీ షేర్ చేసిన ప్రోటోటైప్‌ను కూడా ప్రదర్శించింది. ఇది Huawei సొంత ట్రిపుల్-ఫోల్డబుల్ మోడల్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న Samsung, ఈ వినూత్న పరికరాన్ని ఏడాది చివరి భాగంలో విడుదల చేయాలని భావిస్తోంది. గతేడాది వాణిజ్యపరంగా లాంచ్ అయిన Huawei వెర్షన్ ఈ కేటగిరీలో ముందుగా వచ్చింది. శామ్సంగ్ కొన్ని సంవత్సరాల క్రితం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో తన ట్రిపుల్-ఫోల్డబుల్ ఫోన్ ఐడియాను పరిచయం చేసింది. ఇక 2025లో Galaxy Unpacked ఈవెంట్ సందర్భంగా, కంపెనీ అధికారికంగా ప్రోటోటైప్‌ను టీజర్ ను విడుదల చేసింది.
Tri-Fold Phone : G స్టైల్-శైలి ఫోల్డింగ్ డిజైన్
శామ్సంగ్ నుంచి ట్రిపుల్-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 9.9 నుంచి 10 అంగుళాల వరకు డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు . మడతపెట్టినప్పుడు, ఇది మరింత కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ రూపాన్ని పొందుతుంది. ఈ ఫోన్ G స్టైల్-శైలి ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉండవచ్చు, దీనికి విరుద్ధంగా, Huawei మడత ఫోన్ Mate X S- ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది.
అయితే, ఇటీవలి నివేదికలు నిజమైతే, Samsung తన ట్రిపుల్-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను పరిమిత పరిమాణంలో ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లు రెండు దిశల్లోకి ఫోల్డ్ అయ్యేలా రూపొందించబడ్డాయి, వినియోగదారులు వాటిని మడతపెట్టినప్పుడు కూడా కాంపాక్ట్‌గా, విడదీసినపుడు టాబ్లెట్ మాదిరిగా కనిపించనుందని తెలుస్తోంది .
ఇదిలా ఉండగా Samsung Galaxy S25 Edge 6.4mm మందం కలిగి ఉంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది Galaxy S25, Galaxy S25+ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.80,999.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.