
Amul Milk Price : చాలా కాలంగా పాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇందుకు భిన్నంగా అమూల్ వినియోగదారులకు స్వల్ప ఊరట ఇచ్చింది. అమూల్ పాల ధరను తగ్గించింది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, టీ స్పెషల్ మిల్క్ రేట్లను తగ్గించింది. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ తన మూడు ప్రధాన ఉత్పత్తులైన అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్‌లపై లీటరుకు ₹1 తగ్గింపును ప్రకటించింది. దేశంలో పాల ధర గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు పాల ధరలను పెంచాయి. కానీ అమూల్ ఇప్పుడు పాల ధరలను తగ్గించడం వల్ల ధరలను తగ్గించాలని ఇతర కంపెనీలపై ఒత్తిడి పడనుంది .
Amul Milk Price : తాజా కొత్త ధరలు:
- అమూల్ గోల్డ్ (1 లీటర్) ₹65,
- అమూల్ టీ స్పెషల్ (1 లీటర్) ₹61
- అమూల్ తాజా (1 లీటర్) ₹53
ధర తగ్గింపు వెనుక కారణాలు
వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, పాల లభ్యతను పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్లు GCMMF మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా తెలిపారు, ‘ఉత్పత్తి వ్యయం తగ్గడం, మెరుగైన నిర్వహణ కారణంగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వినియోగదారులకు నాణ్యమైన పాలను సరసమైన ధరలకు అందించడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
మిగతా కంపెనీలపై ప్రభావం
పాల ధరల తగ్గింపు మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, దీని కారణంగా ఇతర పాల ఉత్పత్తుల ధరలపై కూడా సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్యుల బడ్జెట్ పై ద్రవ్యోల్బణం దెబ్బ తిన్న తరుణంలో ఈ నిర్ణయాన్ని వినియోగదారులు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాల ధర స్వల్పంగా తగ్గడం కూడా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్తగా భావిస్తున్నారు. అమూల్ పాల ధరలను తగ్గించడం వల్ల కంపెనీ మార్కెట్‌లో పోటీని పెంచడంతో సహాయపడుతుంది. వేదాంత, దూద్ రత్న, సురభి వంటి ఇతర డైరీ బ్రాండ్‌లు కూడా ఈ మార్పు వల్ల ప్రభావితం కావొచ్చు. ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడు నాణ్యమైన ఉత్పత్తులతోపాటు తక్కువ ధరలను చూస్తారు. ఇతర పాల బ్రాండ్లు కూడా వాటి ధరలను తగ్గించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.