Home » New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు
Secunderabad-Goa Train

New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

Spread the love

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) (Secunderabad to Goa Express) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను నడిపించ‌నున్న‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్రకటించింది.

ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో ప్రారంభమవుతుంది. కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, గుంతకల్‌, బళ్లారి, హోసపేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాజిల్‌ రాక్‌, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్‌ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ప్రస్తుతం, సికింద్రాబాద్ నుండి 10 కోచ్‌లతో వీక్లీ రైలు బయలుదేరి గుంతకల్ (ఆంధ్రప్రదేశ్) చేరుకుంటుంది. గుంతకల్ వద్ద, తిరుపతి నుండి మరో 10 కోచ్‌లను జోడించి, గోవాకు వెళ్లే కొత్త రైలును ఏర్పాటు చేశారు.ఇది కాకుండా, గోవా వెళ్లే నాలుగు కోచ్‌లను కాచిగూడ-యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణించే రైలుకు అనుసంధానించారు. ఈ నాలుగు కోచ్‌లు గుంతకల్‌లో షాలిమార్-గోవా రైలులో చేరేవి.

READ MORE  Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

సికింద్రాబాద్‌-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని, సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) మార్చిలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ (union Railway Minister Ashwini Vaishnav) కు లేఖ రాశారు. దీనిపై మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం సికింద్రాబాద్, వాస్కోడిగామా (Secunderabad to Goa Express) మధ్య రెండు వారాల ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ బైవీక్లీ రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో, తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.

READ MORE  Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

ఈ కొత్త రైలు సికింద్రాబాద్‌, కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్‌పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, క్యాజిల్‌ రాక్‌, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్‌ జంక్షన్‌లలో ఆగుతుంది. ఈ వివరాలను కిష‌న్ రెడ్డి X ( ట్విట్టర్)లో పోస్టు చేశారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..