
New Exrpress | ప్రయాణికులకు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) (Secunderabad to Goa Express) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో ప్రారంభమవుతుంది. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, గుంతకల్, బళ్లారి, హోసపేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాజిల్ రాక్, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.ప్రస్తుతం, సికింద్రాబాద్ నుండి 10 కోచ్‌లతో వీక్లీ రైలు బయలుదేరి గుంతకల్ (ఆంధ్రప్రదేశ్) చేరుకుంటుంది. గుంతకల్ వద్ద, తిరుపతి నుండి మరో 10 కోచ్‌లను జోడించి, గో...