Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా
బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది. బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే […]
తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య
మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఓ వ్యక్తి తన భోజనం తయారీలో కేవలం రెండే రెండు టమాటాలను తన భార్యకు చెప్పకుండా వండాడు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. […]
ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..
ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World’s Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది. విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ […]
ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, […]
విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి […]
భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు. ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన […]
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..
దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ సుమారు 4వేల మందికి ఉపాధి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా […]
మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. ‘Brain-Eating Amoeba’ గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ […]
సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో […]
కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..
యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం […]
