Friday, March 14Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

24 గంటల్లో 5 భూకంపాలు

24 గంటల్లో 5 భూకంపాలు

National
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత మొదటి ప్రకంపనలు సంభవించాయి.జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో అనేక తక్కువ-తీవ్రత గల భూకంపాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలోభూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భూకంపం లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం,...
యోగా వారోత్సవాలు ప్రారంభం

యోగా వారోత్సవాలు ప్రారంభం

National
 International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు. దినచర్యగా మారాలి లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో 'యోగ సప్తా' (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదే...
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

National
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.ముంబై - గోవా వందే భారత్ (Mumbai - Goa Vande Bharat)గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది.దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే ఏడు స్టేషన్లలో ఇది హాల్టిం...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్

National
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట ప్రకటించింది. అయితే ఆ తర్వాత బాలురకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.“ఇ-స్కూటీ విద్యార్థులను వారి ఇళ్ల నుంచి కళాశాలలకు వచ్చిపోయేందుకు వీలుగా ఉంటుందని మిశ్రా తెలిపారు. దీంతో పాటు, SC / ST విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడి...
జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

National
వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.“ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ &...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

Crime, National
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను 'హిజాబ్' ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు.స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజ...
మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

National
హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు మూసివేశారు. బీహార...
ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు

ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు

National
రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని అక్కడే శేష జీవితం గడుపుతానని తెలి...
ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

National
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చే...
యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

National
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు కూడా ఉన్నారు."ఇది బాధాకరమైన సంఘటన. మేము కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఈ దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాల వెంటే ఉన్నాము. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?