Sunday, April 27Thank you for visiting

PM Surya Ghar Yojana : 6.75 శాతం వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందండి.

Spread the love

PM Surya Ghar Muft Bijli Yojana : ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ కార్యక్రమం అయిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందించింది. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలరైజేషన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. “ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఇప్పటివరకు 1 మిలియన్ ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అవుతోందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

PM Surya Ghar Yojana : పథకం అంటే ఏమిటి ?

Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైన సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ (Solar Panels) ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా, 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు రుణాలతో సహా సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తున్నాయి.

READ MORE  Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

ప్రయోజనాలు:

  • రూ.78,000 వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ.
  • రూ.6 లక్షల వరకు రుణాలు, ROI లేదా వడ్డీ రేటు సంవత్సరానికి కేవలం 6.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
  • 2 లక్షల వరకు రుణాలకు ఆదాయ పత్రాలు అవసరం లేదు.
  • ఖర్చులో 90 శాతం వరకు ఫైనాన్స్ ఉంటుంది.

సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన: అర్హత

  • ఇంటి యజమాని భారతీయ పౌరుడై ఉండాలి.
  • యజమాని సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.
  • ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
  • ఆ కుటుంబం సౌర ఫలకాలకు మరే ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు.
READ MORE  Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన: ఎలా దరఖాస్తు చేయాలి?

దశ 1: అధికారిక వెబ్‌సైట్‌ను https://pmsuryaghar.gov.in/ ను సందర్శించండి
దశ 2: కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి “Apply Now” అనే ఆప్షన్ ను ఎంచుకోండి (లేదా) లాగిన్ డ్రాప్‌డౌన్ మెనుని తెరిచి “కన్స్యూమర్ లాగిన్” ఎంచుకోండి.
దశ 3: మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి దాన్ని ధృవీకరించండి. పేరు, రాష్ట్రం, ఇతర వివరాలను అందించండి. మీ ఇమెయిల్ ఐడిని ధృవీకరించండి. మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయండి.
దశ 4: విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి Yes లేదా NO ఎంచుకోండి.
దశ 5: ఆ తర్వాత ‘Apply for Solar Rooftop’ పై క్లిక్ చేసి, రాష్ట్రం, జిల్లా డిస్కామ్, ఇతర వివరాలను అందించండి.
దశ 6: ఆ తర్వాత, విక్రేతను ఎంచుకుని, సబ్సిడీ కోసం బ్యాంక్ వివరాలను అందించండి.

READ MORE  Budget 2024 - Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..