Home » యోగా వారోత్సవాలు ప్రారంభం
International Yoga Day

యోగా వారోత్సవాలు ప్రారంభం

Spread the love

 

International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు.
దినచర్యగా మారాలి
లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ‘యోగ సప్తా’ (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు.

READ MORE  Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శ‌ర్మ‌

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో యోగాభ్యాసం చేయనున్నారు.

ముఖ్యంగా, తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన థీమ్ ‘హర్ ఘర్-అంగన్ యోగా’ పై అటవీ శాఖ మంత్రి అరుణ్ కె సక్సేనా ప్రసంగిస్తూ ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు సూచించే మందులు అన్ని వ్యాధులకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. “ఉత్తమ ఫలితాల కోసం డాక్టర్ నుండి సలహా తీసుకోండి ప్రిస్క్రిప్షన్ అనుసరించండి” అని అటవీ మంత్రి చెప్పారు. “యోగ ఆసనాలు సురక్షితమైనవి, చాలా ప్రభావవంతమైనవి, గర్భధారణ సమయంలో కూడా సహాయపడతాయి. అయితే, ఇది ఖచ్చితంగా నిపుణుల మార్గదర్శకత్వంలో జరగాలి” అని ఎస్సీ త్రివేది మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్‌లోని సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమిత శుక్లా అన్నారు.

READ MORE  Lok Sabha elections | లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..

కాగా, 175 దేశాల్లోని ప్రజలకు యోగా రోజువారీ అలవాటుగా మారిందని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ అన్నారు. అంతేకాకుండా యోగా పరిజ్ఞానం ప్రతి ఇంటికి చేరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. యోగా మన ఆత్మను శరీరంతో కలుపుతుంది అని మిశ్రా తెలిపారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

READ MORE  Bahraich : బ‌హ్రైచ్ హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లపై బుల్డోజ‌ర్ యాక్షన్..?

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..