రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ..
vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ముంబై – గోవా వందే భారత్ (Mumbai – Goa Vande Bharat)
గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది.
దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే ఏడు స్టేషన్లలో ఇది హాల్టింగ్ అవకాశం ఉంది. దాని రెగ్యులర్ టైమ్‌టేబుల్ విడుదల చేయనప్పటికీ, ఇది CSMT నుండి ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:15 గంటలకు మడ్గోన్ చేరుకుంటుంది.
ఒడిశా దుర్ఘటన తర్వాత ముంబై-గోవా వందే భారత్ రైలు ప్రారంభాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.
బెంగళూరు – హుబ్బల్లి – ధార్వాడ్ (Bengaluru – Hubballi – Dharwad)
బెంగళూరు- హుబ్బల్లి-ధార్వాడ్ మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కర్ణాటక ఏర్పాటు చేయనుంది. చెన్నై, బెంగళూరు, మైసూరు మధ్య నడిచే మొదటి వందే భారత్ రైలు ఇది. కర్ణాటకకు ఇది రెండవది.
బెంగళూరు- హుబ్బల్లి – ధావార్డ్ మధ్య సెమీ-హై స్పీడ్ రైలు మొదట్లోనే ప్రారంభించాల్సి ఉండగా, డౌన్‌లైన్ విద్యుదీకరణ కారణంగా ఆలస్యం అయింది. ఇది నైరుతి రైల్వే (SWR)కు సంబంధించి మొదటి రేక్. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ధార్వాడ్ ఎంపీ ప్రహ్లాద్ జోషి మే 31న అశ్విని వైష్ణవ్‌ను కలిసి వందే భారత్ రైలు ఎంట్రీపై చర్చించారు.
పాట్నా – రాంచీ వందే భారత్ (Patna – Ranchi)
భారతీయ రైల్వే గత సోమవారం బీహార్, రాంచీలలో మొదటి సెమీ-హై స్పీడ్ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇది పాట్నా జంక్షన్ నుండి ఉదయం 06:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 01:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
రాంచీలోని సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ రూట్ కాహర్ట్ ధృవీకరించబడనప్పటికీ, చర్చల ప్రకారం, ఈ రైలు తాటిసిల్వాయి, మెర్సా, శంకి, బర్కాకానా, హజారీబాగ్, కోడెర్మా మరియు గయా మీదుగా నడిచే అవకాశం ఉంది.
ఎనిమిది రేక్‌ల సెమీ-హై స్పీడ్ రైలు ఛార్జీ చైర్ కార్‌కి రూ.1,000 నుండి రూ. 1,200, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కి రూ.2,000 రేంజ్ లో ఉంటుంది.
భోపాల్ – ఇండోర్ వందే భారత్ (Bhopal – Indore Vande Bharat)
భోపాల్- ఇండోర్‌లను కలిపే సెమీ-హై స్పీడ్ రైలును రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి జూన్ 27, మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభిస్తారని మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) యూనిట్ అధ్యక్షుడు విడి శర్మ తెలిపారు.
మధ్యప్రదేశ్ యొక్క రెండవ సెమీ-హై స్పీడ్ రెండు నగరాల మధ్య 130 కిమీ వేగంతో నడుస్తుంది.
భోపాల్ – జబల్పూర్ వందే భారత్ (Bhopal – Jabalpur vande bharat express)
భోపాల్ – జబల్‌పూర్‌లను కలిపే సెమీ-హైస్పీడ్ రైలును రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి జూన్ 27, మంగళవారం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ లో మూడవ సెమీ-హై స్పీడ్ రైలు ఇది. రెండు నగరాల మధ్య 130 కిమీ వేగంతో నడుస్తుంది.
“ప్రధాని జూన్ 27న భోపాల్ చేరుకుని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 10 లక్షల బూత్‌ల నుండి వర్చువల్‌గా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని ఖజురహో నుంచి లోక్‌సభ సభ్యుడు శర్మ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని 64,100 బూత్‌ల నుండి 38 లక్షల మంది కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. 116 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా 18 రూట్లలో పనిచేస్తున్నాయి, అయితే బిలాస్‌పూర్ నాగ్‌పూర్ వందే భారత్ రైలు తాత్కాలికంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ ద్వారా భర్తీ చేయబడింది. వందేభారత్ రైళ్లు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రయాణికుల సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొట్టమొదటి సెమీ-హైస్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి