Friday, March 14Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..

మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..

National
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు.ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తో...
సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

National
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటనడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం  6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది...
రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ 

రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ 

National
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు రాష్ట్రాల పర్యటనలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రధాని ఈ పర్యటనలో రూ.50,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ శుక్రవారం గోరఖ్ పూర్ లో పర్యటించనున్నారు, అక్కడ రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు-గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్, జోధ్ పూర్-సబర్మతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ సెమీ-హై-స్పీడ్ రైలు బాబా గోరఖ్ నాథ్, గోరఖ్ పూర్ నగరాన్ని లక్నోలోని నవాబ్స్ నగరా...
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

National
 వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు. మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, "మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని  గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ వి...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

National, Trending News
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...
సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

National
గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు.సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు..వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. రైతు అరుపులను చూసి సింహ...
రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

National
 న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై "బ్లాక్ స్పాట్స్" తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు." అని గడ్కరీ అన్నారు.అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54...
దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

National
ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు  దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం..రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో 'సహర్స-అమృతసర్ గరీబ్ రథ్' ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కోచ్ నుంచి...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

National
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి..Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ...
అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు

అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు

National
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబి...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?