Posted in

సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

Spread the love

గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు.

సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు..

వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. రైతు అరుపులను చూసి సింహం ఆవును వదిలేసింది. అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

గత నెల ప్రారంభంలో, ఒక గేదె మొసళ్ల తో నిండిన నదిలోకి దిగింది. అక్కడే కాపు కాచుకొని ఉన్న  సింహం ఒక్కసారి గా దాడి చేయగా.. ఆ గేదె విజయవంతంగా అడ్డుకొని ప్రాణాలతో బయట పడింది.. ఎలిఫెంట్ వాక్ రిట్రీట్‌లో మేనేజర్ ఆంటోని బ్రిట్జ్ ఈ వీడియోను చిత్రీకరించారు.

 

 

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *