
మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
Manipur Shocking incident : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు "మరణశిక్ష" విధించే...