Home » ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
New Delhi robbery case

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

Spread the love

పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు.

READ MORE  జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు.

“వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ఉంటుంది. తదుపరి విచారణ జరుగుతోంది” అని పూణే పోలీస్ కమిషనర్ రీతేష్ కుమార్ తెలిపారు.
కాగా ఈ నిందితులిద్దరినీ కానిస్టేబుల్ ప్రదీప్ చవాన్, అమోల్ నజాన్ పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ చవాన్, అమోల్ నజాన్ ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. స్థానిక పోలీసులు మహారాష్ట్ర ఎటిఎస్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి సమాచారం అందించారు, ఇద్దరు అనుమానితులను మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.
పోలీసులు ఈరోజు నిందితులిద్దరినీ స్థానిక కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు పంపనున్నారు. ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ఏటీఎస్‌లు కూడా విచారణలో చేరి నిందితులిద్దరినీ తర్వాత ప్రశ్నించే అవకాశం ఉంది.

READ MORE  Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..