
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB
ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానంన్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది.2019 నుంచి 2021 మధ్యకాలంలో 18 ఏళ్లు పైబడిన 10,61,648 మంది మహిళలు, 18 ఏళ్లలోపు బాలికలు 2,51,430 మంది కనిపించకుండా పోయారు. National Crime Records Bureau నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ వివరాలను సేకరించింది. మధ్యప్రదేశ్లో మూడేళ్లలో 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు, పశ్చిమ బెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు, మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు అదృశ్యమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం తప్పిపోయిన బాలికలు, మహిళల ఆచూకీ లభ...