Home » ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india

ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి

Spread the love

wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ గురువారం రాజ్యసభలో తెలిపారు.

ఈ సంఘర్షణలో మొత్తం బాధితుల్లో 90 శాతం మంది ప్రాణాలను బలిగొన్నది ఏనుగుల దాడి. 2022-23లో 605 మంది ఏనుగుల దాడులకు గురయ్యారు. 148 మరణాలతో ఒడిశాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

READ MORE  Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..

పులుల దాడుల విషయానికొస్తే, దేశంలో పులుల కారణంగా మరణించిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2021లో 59 మంది పులుల దాడిలో మరణించగా, 2022 నాటికి 103 మంది మరణించారని మంత్రి తెలిపారు. పులుల దాడి వల్ల అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక్కడ 85 మంది మరణించారు.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి వన్యప్రాణులు దాని పరిసర ప్రాంతాలలో సరళ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తాము ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

READ MORE  Indian Railways Latest Update | 7 రైల్వే స్టేషన్ల పేర్లు మారిపోతున్నాయ్.. అవేంటో తెలుసా..

“ఫిబ్రవరి 2021లో మానవ-వన్యప్రాణుల సంఘర్షణను ఎదుర్కోవటానికి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, UTలకు ఒక సలహాను జారీ చేసింది. మానవులు, వన్యప్రాణులు ఎదురుపడే హాట్ స్పాట్‌లను గుర్తించడం; ప్రామాణిక కార్యాచరణ విధానాలకు కట్టుబడి ఉండటం; క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటుచేయడం వంటి చర్యలను చేపడుతున్నట్లు మంత్రి వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నివారణ కోసం రేడియో కాలరింగ్, ఇ-సర్వెలెన్స్ వంటి అధునాతన సాంకేతికతను కూడా ఉపయోగించినట్లు మంత్రి తెలిపారు.

READ MORE  Mann Ki Baat : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. కుంభామేళా

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..