జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’
దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ?
యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకుని ముస్లింలకు చేరువయ్యేందుకు పార్టీ మైనారిటీ విభాగం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది.
జూలై 27 నుంచి ఢిల్లీలో ‘పస్మాండ సంవాద్’ (Pasmanda Samvad) ను ప్రారంభించనుంది. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి అయిన అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఢిల్లీ నుండి ప్రచారం మొదలై ఉత్తరాఖండ్‌కు చేరుకుంటుంది. ఆపై ఉత్తరప్రదేశ్‌లో వారణాసి, బీహార్‌లో నిరంతర ప్రచారం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ప్రచారం నిర్వహించి హర్యానాలో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు నవంబర్-డిసెంబరులో ఎన్నికలుజరగనున్నాయి.
బీజేపీ మైనారిటీ సెల్ చీఫ్ జమాల్ సిద్ధిఖీ మాట్లాడుతూ ముస్లిం సమాజానికి సొంతంగా బలమైన ఐకాన్ లేదని అన్నారు. ‘ముస్లింలు పండిట్ నెహ్రూను తమ ఐకాన్‌గా భావించారు, ఆపై ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. కానీ కాంగ్రెస్ కేవలం ఓట్ల కోసమే ఆ వర్గాన్ని ఉపయోగించుకుంది, వారికి ఏమీ ఇవ్వలేదు’ అని సిద్ధిఖీ అన్నారు. ‘ముస్లింలలోని పస్మాండ (వెనుకబడిన తరగతి) గురించి మాట్లాడింది కేవలం ప్రధాని మోదీ ఒక్కరే.’ అని పేర్కొన్నారు. కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పస్మాండ ముస్లింలను కోరడమే లక్ష్యం అని ఆయన చెప్పారు. మోడీ ‘పేదల అనుకూల’ ప్రభుత్వ పథకాలను ప్రచారంలో హైలైట్ చేస్తామని ఆయన అన్నారు. ఇందులో చదువుల కోసం EWS కోటా (EWS quota), ఉజ్వల, PM ఆవాస్, ముద్ర (Mudra), స్టార్టప్ పథకాలు మొదలైనవి ఉన్నాయి.
వెనుకబడిన తరగతుల ఓట్లను ఆకర్షించడంలో బీజేపీ నిరంతరం ముందుంటుంది. గత ఏడాది జూలైలో పార్టీ జాతీయ కార్యవర్గంలో, అజంగఢ్, రాంపూర్‌లలో జరిగిన ఉపఎన్నికలలో పార్టీ విజయం సాధించిన తర్వాత, పస్మాండ ముస్లింలకు చేరువకావాలని ప్రధాని మోదీ.. పార్టీ నాయకులను కోరారు. గత నెల, ఎంపీలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, నేటికీ పస్మాండ ముస్లింలకు సమాన వాటా ఇవ్వలేదని,. వారిని అంటరానివారిగా భావిస్తున్నారని అని పేర్కొన్న విషయం తెలిసిందే..
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి