Posted in

Medaram Jatara | ఎలాంటి అద‌న‌పు వ‌సూళ్లు ఉండ‌వు.. మేడారం బస్సులపై ఎండీ సజ్జనార్

Medaram Jatara
Spread the love

Telangana : మేడారం సమక్క – సారక్క జాతర (Medaram Jatara) బుధవారం నుంచి అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. అయితే మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) సుమారు 6వేల వ‌ర‌కు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియా తో మాట్లాడుతూ.. మేడారం జాతరకు తెలంగాణ‌లోని అన్ని ముఖ్య న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందని తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఆయా జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్ర‌మంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు వివ‌రించారు. మేడారం జాతర ( Medaram Jatara )కు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుందన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయింనిన‌ట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడంలేద‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *