Medaram Tribal Fair : మేడారం అంటే ధైర్యపరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మల పుట్టినిల్లు.. వారిని తలుచుకుంటేనే ఒళ్లు పులకరించే చరిత్ర గుర్తుకు వస్తుంది. నాటి కాకతీయులతో పోరాటలోని ప్రతిఘట్టం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు, ప్రాంతానికి ఒక ఘన చరిత్ర ఉటుంది. జాతరలో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma ) తోపాటు ఎవరెవరు ఉంటారు..? వారి నివసించింది ఎక్కడ.. జారత వేళ గద్దెలకు ఎప్పుడొస్తారు.. అసలు మహాజాతర ఎలా జరుగుతుంది…? ఈనెల 21వ తేదీన ప్రారంభమయ్యే జాతర నాలుగురోజుల పాటు ఒక్కోరోజు చోటుచేసుకునే ప్రధాన ఘట్టాలేమిటో తెలుసుకోండి..
చరిత్రకారులు, పరిశోధకుల కథనం ప్రకారం సమ్మక్క–సారలమ్మ 12వ శతాబ్ధానికి చెందినవారు. సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయుల చేతిలో పోరాడిన ధీరవనితలుగా వారిద్దరూ గుర్తింపు పొందారు.
సమ్మక్క తల్లి ..
మాఘశుద్ధ పౌర్ణమి రోజున కోయ దొరలకు అడవిలో చుట్టూ పులుల సంరక్షణలో దొరికిన శిశువుకు సమ్మక్కగా నామకరణం చేయగా కోయవారింట అల్లారుముద్దుగా పెరిగిన కూన. 12వ శతాబ్ధంలో ప్రస్తుత కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాస Polavalasa ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర అయిన మేడరాజు Medaraju కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు (Pagididda Raju )ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క–పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.
ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్షతో పొలవాసపై దండెత్తాడు. దీంతో భయపడిన మేడరాజు మేడారానికి పారిపోతాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయరాజుల సామంతుడి ఉన్నాడు. అయితే కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. ఒకవైపు కప్పం కట్టకపోవడం, మరోవైపు మేడరాజుకు ఆశ్రయం కల్పించడం.. అలాగే, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు రగిలిస్తూ కాకతీయ రాజ్యాధికారాన్ని దిక్కిరస్తున్నాడనే కారణాలతో పగిడిద్ద రాజును అంతమొందించేందుకు ప్రతాపరుద్రుడు పథకం రచిస్తాడు.ఈ మేరకు తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపై దండెత్తుతాడు. సందర్బంగా జరిగిన పోరులోనే సమ్మక్క వీరోచితంగాపోరాడి వీరవణితగా పేరుపొందింది. మేడారంపై దండెత్తడానికి వచ్చిన కాకతీయ సేనలను ఎదుర్కొని వీరమరణం పొందింది. అనంతరం చిలుకలగుట్ట (Chilukala Gutta) వైపు వెళుతూ మార్గమధ్యలోనే అదృశ్యమైంది.. కుంకుము రూపంలో వెలసి భక్తులకు కొంగులంగారంగా విలసిల్లుతోంది.
పగిడిద్దరాజు
పగిడిద్దరాజు(Pagididda Raju) సమ్మక్క భర్త, మేడారం ప్రాంతానికి పాలకుడు. పేద ప్రజల మన్ననలు పొందేలా ఆదర్శవంతమైన పాలన సాగించాడు. కరువు పరిస్థితుల్లో కూడా కప్పం కట్టమని వేధించిన మహారాజు ప్రతాపరుద్రుడిని ఎదిరించాడు. యుద్ధభూ మిలో వీరమరణం పొందారు. కొత్తగూడ మండలం పూనుగుండ్లలో కొలువై ఉన్న పగిడిద్దరాజుకు సమ్మక్క సారలమ్మలతో పాటు అదే ప్రాంగణంలో ప్రత్యేక గద్దెను నిర్మించారు.
సారలమ్మ..
సారలమ్మ(Saralamma) సమ్మక్క గారాలపట్టి తల్లిదండ్రులు పగిడిద్దరాజు.. సమ్మక్కల రక్తంతోపాటు ధైర్యపరాక్రమాలను పునికిపుచ్చు కున్న వరాల బిడ్డ తల్లితోపాటు కాకతీయ సేనలను చీల్చిచెండాడి వీర మరణం పొందిన ధీశాలి. మరణం తర్వాత కన్నెపెల్లిలో దేవతై నెల సింది. తల్లి సమ్మక్క ఆగమనానికి ఒక్క రోజు ముందు సారలమ్మను పూజారులు కన్నెపల్లి (Kannepalli) నుంచి తోడ్కొని వస్తారు. దీంతో మేడారం జాతర ప్రారంభమవుతుంది. తల్లితో పాటు సమానంగా భక్తుల నుంచి మొక్కులు అందుకుంటుంది.
జంపన్న…
Medaram Tribal Fair పగిడిద్దరాజు- సమ్మక్కల చిన్నకుమారుడు జంపన్న (Jampanna), గుండెబలంతో అణగదొక్క చూసిన కాకతీయ రాజు పై తెగువ చూపిన ముక్కుసూటి కొయవీరుడు. శత్రు సైనికుని కత్తి ఘాతుకానికి బలై నేలకొరిగిన ధీరోత్తముడు. చిందిన జంపన్న నెత్తురే నాటి సంపెంగవాగులో పారింది. అందుకే ఈ కోయ యువ కిశోరానికి జ్ఞాపకంగా ఆవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. ఈవాగులో పుణ్య స్నానం చేయనిదే ఏభక్తుడూ సమ్మక్క-సారలమ్మల దర్శ నానికి వెళ్లరు. ఈ వాగునీటి స్పర్శతోనే పులకించిపోయే హృదయాలెన్నో.. పుట్టిన తనబిడ్డ జంపన్నంత ప్రయోజకుడు కావాలని, ఆ పేరునే పెట్టుకోవాలని జాతరకు వచ్చే భక్తులు ఆరాటపడేంత శూరుడు.
గోవిందరాజులు..
గోవిందరాజు(GovindaRajulu) సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలకు పినతండ్రి. కాకతీయ సేనలను ఎదురించిన వారిలో ఇతనూ ఒకరు, ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువుదీరిన గోవిందరాజులుకు మేడారంలోని గద్దెల ప్రాంగణంలో ప్రత్యేక గద్దె ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..