
Medaram Jatara | ఎలాంటి అదనపు వసూళ్లు ఉండవు.. మేడారం బస్సులపై ఎండీ సజ్జనార్
Telangana : మేడారం సమక్క - సారక్క జాతర (Medaram Jatara) బుధవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) సుమారు 6వేల వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియా తో మాట్లాడుతూ.. మేడారం జాతరకు తెలంగాణలోని అన్ని ముఖ్య నగరాలు, పట్టణాల నుంచి ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందని తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఆయా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు వివరించారు. మేడారం జాతర ( Medaram Jatara )క...