Integrated Residential Schools | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్. డిప్యూటీ సీఎం నియోజకవర్గం మధిర పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్ శాంతికుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్ కమిటీ తొలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. కొడంగల్, మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల (Integrated Residential Schools) నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోనే ప్రారంభించాలని ఆదేశించారు. పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు పాటించాల్సిన విధానలు, ప్రతిపాదనల ప్రక్రియకు నోడల్ విభాగం ఖరారుపై చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ, రెసిడెన్షియల్ పాఠశాలలకు భూముల కేటాయించడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..