Home » Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Deepavali 2024 Date

Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా..  దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై  చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు.

ప్రముఖ జోత్యిష్య పండితుల ప్రకారం..  ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 తోపాటు నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వొచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆ రోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

READ MORE  ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

అమావాస్య ఘడియలు అక్టోబర్​ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 శుక్రవారం రోజు సాయంత్రం 6.15 వరకు ఉన్నా.. ఆ రోజు దీపావళి జరుపుకోకూడదని వివరిస్తున్నారు. ఎందుకంటే దీపావళి సాయంత్రానికి అమవాస్య తిథి ఉండటం ముఖ్యం. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పూట అమావాస్య లేనందున నవంబర్​ 1న దీపావళి జరుపుకోవద్దని చెబుతున్నారు. కాబట్టి.. అక్టోబర్ 31న గురువారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో ఆ రోజునే ఉదయం నరక చతుర్థశి జరుపుకోవాలని.. సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు.

READ MORE  నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

దీపావళి పూజా సమయాలు:

  • దీపావళి 2024: అక్టోబర్ 31
  • లక్ష్మీ పూజ ముహూర్తం – సాయంత్రం 06:52 గంటల నుండి 08:41 pm
  • వ్యవధి – 01 గంటల 50 నిమిషాలు
  • ప్రదోష కాలం -సాయంత్రం 06:10 గంటల నుండి 08:52 pm
  • అమావాస్య ప్రారంభం: అక్టోబర్ 31 ఉదయ 6.22 గంటలు.
  • అమావాస్య ముగింపు: నవంబర్ 1, ఉదయం 8.46 గంటలు

Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు అందించినవి మాత్రమే. దీనిని వందేభారత్ నిర్ధారించడంలేదు.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించగలరు. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది  మీ వ్యక్తిగత విషయంగా భావించగలరు..

READ MORE  New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్