Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల ‘బజాజ్ ఫైటర్’ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్ అని తెలుస్తోంది.
CNG బైక్ జూన్ 18న విడుదల
బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల జరిగిన పల్సర్ 400 లాంచ్ ఈవెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను జూన్ 18న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం వరకు తగ్గుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా స్థిరంగాకొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న CNG బైక్ తో రన్నింగ్ ఖర్చులు తగ్గిపోయిన వినియోగదారులకు భారీగా ఊరటనివ్వనున్నాయి. ఇది మొదట మహారాష్ట్రలో, తర్వాత CNG స్టేషన్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ప్రారంభించనుంది. కాగా CNG బైక్‌ల పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తామని, ఇందులో 100 CC, 125 CC, 150-160 CC బైక్‌లు ఉంటాయని రాహుల్ బజాజ్ అన్నారు. ఇంజన్ కెపాసిటీ 110-125cc మధ్య ఉండనుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం.
bajaj cng bike .. ప్రోటోటైప్‌ను పరీక్షించిన సమయంలో.. కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలలో 50% తగ్గగా. కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉద్గారాలలో 75% తగ్గింది. అలాగే నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలలో 90% తగ్గిందని కంపెనీ పేర్కొంది. దీనిని బట్టి CNG బైక్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..