Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది.
హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38°C, 26°C నమోదయ్యే అవకాశం ఉంది.
రాబోయే 7 రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కి.మీ.)తో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
కాగా శనివారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, జగిత్యాలలోని కోల్వాయిలో 45.5 ° C నమోదైంది. కాగా, హైదరాబాద్‌లో శనివారం 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.