Home » Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!
Lok Sabha Exit polls

Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!

Spread the love

Lok Sabha Exit polls : లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్‌ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గ‌తంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుంద‌ని దాదాపు అన్ని సర్వేలు వెల్ల‌డించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవ‌లం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌
ఎన్డీఏ – 353-368
ఇండియా కూటమి – 118-133
ఇతరులు – 43-48

ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌
ఎన్‌డీఏ – 371
ఇండియా కూటమి – 125
ఇతరులు – 47

READ MORE  Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..

రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌
ఎన్డీఏ – 359
ఇండియా కూటమి – 154
ఇతరులు – 30

జన్‌కీ బాత్‌
ఎన్డీఏ – 377
ఇండియా – 151
ఇతరులు – 15

న్యూస్‌ నేషన్‌
ఎన్డీఏ – 342-378
ఇండియా కూటమి – 153-169
ఇతరులు – 21-23

దైనిక్‌ భాస్కర్‌
ఎన్‌డీఏ – 281-350
ఇండియా కూటమి – 145-201
ఇతరులు – 33-49

రాష్ట్రాల వారీగా అంచాలు…

Lok Sabha Exit polls : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు ఎన్డీయేకు కలిసి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి. ఏపీలో ఎన్డీయే 18 నుంచి 25 సీట్లను గెలుచుకోనుందని అంచనా వేశాయి. ఇక కర్ణాటకలో బీజేపీ ఘనవిజయం సాధించనుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కర్ణాటకలో బీజేపీ 18 నుంచి 25 సీట్లు సాధిస్తుంద‌ని వెల్ల‌డించాయి. తెలంగాణలో మొత్తం 17 సీట్లలో సగం బీజేపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని, అంచనా వేశాయి. తమిళనాడులో బీజేపీ ఒకటి రెండు సీట్లతో, కేరళలో ఒక సీటుతోనూ బోణీ తెర‌వ‌నుంద‌ని అంచ‌నా వేశాయి.
ఇక‌ పశ్చిమ‌ బెంగాల్‌లోనూ ఈసారి మ‌మ‌తా బెన‌ర్జీకి గ‌ట్టి షాక్ త‌గులుతుంద‌ని, ఈసారి బీజేపీ సీట్లు పెరగనున్నాయని చెప్పాయి. 2019లో బీజేపీకి 18 సీట్లు రాగా ఈసారి 20 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేశాయి. అక్కడి అధికార టీఎంసీ కేవలం 19 సీట్లకే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌‌తో పాటు దిల్లీలోనూ బీజేపీపీ త‌న స‌త్తా చాటుతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో దిల్లీలో పోటీ చేసినప్పటికీ ఆ కూటమి ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమేనని చెప్పాయి. అయితే, బీహార్‌లో పరిస్థితి కొంత మారవచ్చని తెలిపాయి. హర్యానాలో కొద్ది సీట్లు గెలుచుకోవచ్చని కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

READ MORE  Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..