Rain Alert : గుడ్న్యూస్.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!
Rain Alert | తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు కొన్ని జిల్లాలో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.Rain Alert ఈనెల 8న సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగితాల్య, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చల్లని కబురు చెప్పింది వాతావరణకేంద్రం ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది....