Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..

Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..
Spread the love

Indian Railways | విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల కారణంగా ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయ‌నితెలిపింది.

దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే..

రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్
Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19, 21, 2024 తేదీల్లో SMVT బెంగళూరు నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా మళ్లించ‌నున్నారు.

READ MORE  Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

రైలు నెం. 18111 టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
మే 30, జూన్ 06, 13, 2024 తేదీలలో టాటానగర్ నుంచి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనుంది. ఏలూరు స్టేషన్‌లో హాల్టింగ్ సౌక‌ర్యం ఉండ‌దు.

రైలు నెం. 18637 హటియా-SMVT బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
జూన్ 01, 08, 15, 22వ‌ తేదీలలో హటియా నుండి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు.

READ MORE  Vande Metro | వందే మెట్రో రైలు కోచ్‌ల తయారీ కోసం దృఢ‌మైన‌ ఈ కంపెనీ నుంచే..

రైలు నెం. 12835 హటియా-SMVT బెంగళూరు బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
మే 28, జూన్ 02, 04, 09, 11, 16, 18, 23వ తేదీలలో హటియా నుండి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించ‌నున్నారు.

రైలు నం. 12889 టాటానగర్-SMVT బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
మే 31, జూన్ 07, 14, 21వ‌ తేదీలలో టాటానగర్ నుండి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు.

READ MORE  తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *