Hyderabad to Vijayawada Buses : వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ(TSRTC) బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్రయాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సును నడిపించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు.
10 శాతం డిస్కౌంట్
Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివరించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని ఆయన చెప్పారు. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయణంపై టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీని అందిస్తున్నది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైస్పీడ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ అందిస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఈ 10 శాతం రాయితీతో టీఎస్‌ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు
TSRTC Srisailam Buses : శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ(TSRTC) ప్రకటించింది. వేసవిలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం (Srisailam) పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. శ్రీశైలం బస్సులు జేబీఎస్ నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర ఉంటుందని తెలిపింది. ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించినట్లు ప్రకటించింది. వేసవిలో ఉక్కపోతలులేకుండా చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ముందస్తుగా రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని ఆయన సూచించారు.
మరోవైపు ఆవకాయ పచ్చడిని బంధువులు, స్నేహితులకు TSRTC బస్సుల ద్వారా సులువుగా పంపించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల నుంచి ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తున్నదని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీలు చేస్తున్నది. మిగతా వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033, 040-69440000, 040-69440069 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..