Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్
Spread the love

Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాద‌క‌ర‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్య‌మంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయార‌ని అన్నారు.

READ MORE  Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శ‌ర్మ‌

”సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే.. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్ధాలను భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదులే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగిస్తారు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను… ఈ రాష్ట్రం ఉగ్ర‌వాదుల‌కు స్వర్గధామంగా మారింది. . సందేశ్‌ఖాలీలో ఆర్డీ ఎక్స్‌, మారణాయుధాల రికవరీ మధ్య ఈరోజు ఖాదికుల్‌లో జరిగిన సంఘటనపై ట్రైలర్‌ను చూసిన ప్రజలు మమతా బెనర్జీని అరెస్టు చేసి తృణమూల్ కాంగ్రెస్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను అని సువేందు అధికారి వార్తా సంస్థ ANI తో అన్నారు.

READ MORE  మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జనవరిలో జరిగిన దాడికి సంబంధించి సందేశ్‌ఖాలీ హింసాకాండలో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్‌కు చెందిన రెండు స్థావ‌రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిబిఐ మూడు విదేశీ రివాల్వర్లు, ఒక విదేశీ పిస్టల్, ఒక దేశీయ రివాల్వర్, ఒక పోలీసు రివాల్వర్, ఒక దేశీయ పిస్టల్, 120 తొమ్మిది ఎంఎం బుల్లెట్లు, .45 క్యాలిబర్ 50 కాట్రిడ్జ్లు, .380 50 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుంది.

READ MORE  Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

TMC స్పందన: అయితే సిబిఐ దాడుల‌పై టిఎంసి నేత కునాల్ ఘోష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ స్వాధీనం చేసుకోక‌ముందే కొన్ని మందుగుండు సామగ్రిని అమర్చడం ప్రతిపక్షాల కుట్ర కావచ్చునని ఆయన ఆరోపించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *