Attack on RTC bus | హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.
అయితే ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దండగులు దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదనిఅన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం మంచిది కాదు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన #TSRTC బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. pic.twitter.com/M4UZiZP1Oi
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 16, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..