Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

Telangana
TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువార...
ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

Telangana
Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ - సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రైల్వే అధికారులను కోరారు.Ghatkesar-Sanathnagar MMTS : ఘట్‌కేసర్-సనత్‌నగర్ బై-పాస్ లైన్‌లో కొత్త స్టేషన్‌ల కోసం స్థలాలను గుర్తించేందుకు తాత్కాలిక సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులను కోరారు.  “చెర్లపల...
Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?

Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?

Telangana
Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా  ఎక్స్‌ప్రెస్‌ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక   డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్‌ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు  తాజాగా డీలక్స్‌ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి  బహుమతులు ఇస్తామంటూ కొ...
Railway Line | తెలంగాణలో  రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే సేవలు

Railway Line | తెలంగాణలో రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే సేవలు

Telangana
Railway Line | రాష్ట్ర ప్రజలకు శుభవార్త...  తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒరిస్సాకు మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు  కొత్త రైల్వే లైన్ నిర్మాణం దిశగా మార్గం సుగమమం అయింది.  ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా ప్రాంతాల మీదుగా ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.3592 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లనున్న మొదటిసారి రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు కొత్తగా రైల్వే సేవలు అందబాటులోకి వస్తాయి.  ఆయా ప్రాంతాలు కూడా త్వరితగతిన ప్రగతిబాట పట్టనున్నాయి. అయితే తెలంగాణ-ఒరిస్సా రైల్వే లైన్ నిర్మాణానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి రైల్వే శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది...
Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో  తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

Telangana
Telangana Road ways |  మోదీ 3.0 ప్రభుత్వంలో  మొదటి 100 రోజుల ప్రణాళికలో తెలంగాణకు రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రహదారులకు అవకాశం కల్పించారు. అందులో ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల హైవే నిర్మించాలని  నిర్ణయించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు మహర్దశ వచ్చినట్లైంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజామాబాద్ - ఛత్తీస్ గడ్ హైవే.. నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న నేషనల్ హైవే 63ను విస్తరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా పెద్ద పట్టణాలు, గ్రామాలు ఉ...
ORR Hyderabad |  ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో  ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

Telangana
ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...
కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

Telangana
Taskforce Checkings : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) ఆస్మికంగా సోదాలు చేయగా నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోతున్న మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో వండి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చినపుడు దానిని వేడి చేసి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ నాసిరకమైన టీ ఫౌడర్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌, ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు తేల్చారు. కిచెన్‌లో పరిసరాలు అత్యంత దారుణంగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో హోటల్ కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా విధించారు అధికారులు.Task force team has conducted inspections in...
Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Telangana
Modernization of ITI's | హైదరాబాద్‌: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌ను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇవ్వ‌నున్నారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తీసుక...
Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Telangana
Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...
Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

Telangana
Yadagirigutta Temple | హైదరాబాద్: యాదాద్రిలో జూన్ 18వ తేదీ నుంచి ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులను అనుమతించ‌నున్నారు. ప్ర‌సిద్ధ‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జూన్ 18 నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గిరి ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 18న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్‌రావు ధ్రువీకరించారు.గిరి ప్ర‌ద‌ర్శ‌తో భ‌క్తుల సంకీర్త‌న‌లతో ఆల‌య ప‌రిసరాలు ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం వెల్లివిర‌య‌నుంది. అయితే ''గిరి ప్రదక్షిణ''ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది. జూన్ 18న 4,000 మంది భక్తులతో ధార్మిక కార్...