Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

Telangana
New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు.“మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ...
Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Telangana
Ration Cards  | సంక్షేమ పథకాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా రేష‌న్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌తో రేష‌న్ కార్డు లేని నిరుపేద‌లు ఏ ప‌థ‌కాన్ని కూడా పొంద‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.ప్రజా పంపిణీ వ్యవస్థ (ప...
TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..

TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..

Telangana
Power Bills | తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా వారి అధికారిక వెబ్‌సైట్ తో చేయాల్సి ఉంటుంది.వినియోగదారులు గతంలో Gpay,  Paytm, ఫోన్ పే .. వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి విద్యుత్ బిల్లును చెల్లించేవారు. కానీ. తాజాగా ఆర్‌బీఐ ప్రకటనతో ఈ వెసులుబాటు వినియోగదారులకు అందుబాటులో లేకుండాపోయింది. TSSPDCL కూడా అటువంటి థర్డ్-పార్టీ యాప్‌ల నుండి బిల్లులను స్వీకరించడాన్ని నిలిపివేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా చెల్లించండి.. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు ...
New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ

New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ

Telangana
New pensions | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛను (Artistes Pension )కు సంబంధించి సోమ‌వారం జీవో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్ల‌డించారు.స‌మాజంలో కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి రేంవ‌త్ రెడ్డి సారథ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరు...
Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Telangana
Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, ...
Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Telangana
Metro Tickets | హైదరాబాద్ ప్రయాణికులకు ఎండ్-టు-ఎండ్ ర‌వాణా సౌక‌ర్యాన్ని అందించడానికి, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో (Rapido) యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ల వద్ద రద్దీ కూడా తగ్గిపోతుంది. రాపిడో ద్వారా ప్రయాణికులు కనీసం 15 శాతం టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది.ప్రయాణికులు ఇప్పుడు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వారు కోరుకున్న గమ్యస్థానానికి మెట్రో టిక్కెట్‌ల (Metro Tickets)ను సజావుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. చేయవచ్చు. మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapid...
SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Telangana
SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను మ‌రికొన్ని రోజులు పొడిగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.సోమవారం, బుధ‌వారాల్లో న‌డిచే పట్నా- సికింద్రాబాద్‌ ( రైలు నెంబ‌ర్‌ 03253 ) ఆగ‌స్టు 05 నుంచి 30 వరకు,అలాగే ప్ర‌తి బుధ‌వారం న‌డిచే హైద‌రాబాద్ - ప‌ట్నా(రైలు నెంబ‌ర్‌ 07255 ) ఆగ‌స్టు 07 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు న‌డిపించ‌నున్నారు. ప్ర‌తి శుక్ర‌వారం న‌డుస్తున్న రైలు నెంబ‌ర్ 07256 సికింద్రాబాద్ -ప‌ట్నా ఎక్స్ ప్రెస్ రైలు ఆగ‌స్టు 08 నుంచి సెప్టెంబ‌ర్ 27వ‌ర‌కు పొడిగించ‌నున్నారు. దానాపూర్ నుంచి సికింద్రాబాద్ ( 03225 రైలు నెంబ‌రు ) వ‌ర‌కు న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ‌స్టు 1 నుంచి సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు న‌డిపించ‌నున్నారు. ఈ రైలు ప్ర‌తీ గురువారం న‌డుస్తోంది...
MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..

MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..

Telangana
MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్  అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా..ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా - సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ - ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా - సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47243 (సికింద్రాబాద్ - మేడ్చల్) ట్రెన్ నెంబర్.47241 (మేడ్చల్) ట్రెన్ నెంబర్.47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా) ట్రెన్ నెంబర్. 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్) ట్రెన్ నెంబర్. 47119 (హైదరాబాద్ – లింగంపల్లి) ట్రెన్ నెంబర్.47217 (లింగంపల్లి – ఫలక్ నుమా) ట్రెన్ నెంబర్. 47218 ( ఫలక్‌నుమా - రామచంద్రపురం) ...
Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు

Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు

Telangana
Railway Projects in Telangana | కేంద్ర ప్రభుత్వం దేశ్యాప్తంగా కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్త బడ్జెట్ కాలపరిధిలో ఆయా ప‌నులు పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో మెదక్-అక్కన్నపేట, మహబూబ్ న‌గ‌ర్ డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. అలాగే ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో క‌ద‌లిక తీసుకొచ్చింది. ఈనెల 23న ప్రవేశ పెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి బడ్జెట్లో ఆ నిధులను కేటాయించే అవకాశముంది. దీంతో ఈ సంవత్సరంలో తుది దశకు చేర‌నున్న‌ట్లు భావిస్తున్నారు. కాజీపేట- విజయవాడ, కాజీపేట బ‌ల్లార్షా మూడో లైన్ Kazipet Vijayawada Railway line : కాజీపేట- విజయవాడ మూడో లైన్ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. కానీ, పనులు మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగుతూ...
తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా

తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా

Telangana
New Education System | హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సరికొత్త విధానంతో ముందుకు సాగాల‌ని విద్యా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం తోపాటు ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో జ‌రిగిన‌ సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. అంగన్ వాడీలకు సింగిల్ టీచర్ చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ...