ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే….
వివరాలు ఇవీ..
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించారు. ఇక పదో తరగతి సిలబస్ 2024 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. 2024 మార్చి నెలలలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు. Telangana Schools
దసరాకు 13రోజుల సెలవులు
ఇక సెలవుల విషయానికొస్తే.. ఈసారి దసరా (విజయదశమి) సెలవులను 14 రోజుల నుంచి 13 రోజులకు కుదించారు. అక్టోబరు 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. ఇంకా క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి ఐదు రోజులకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. ఇక నాలుగో శనివారం నో బ్యాగ్ డే.. ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొంది.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి