
Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు
Health Benefits with Ragi | ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. అందుకే చాలా మంది మిల్లెట్స్ (Millets) తో చేసిన ఆహారంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే అనేక హెల్త్ బెనిఫిట్స్ కారణంగా ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన మిలెట్లలో రాగులు ప్రధానమైనవి. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. రాగులు శరీర బరువు తగ్గించడం (Weight loss) లో సహాయపడతాయి. ఇవి పోషకమైనదిగా ఉండటమే కాకుండా వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు అధిక బరువు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్లైతే .. మీరు ఈ 5 రుచికరమైన రాగి వంటకాలు ఒకసారి ట్రై చేయండి..
రాగి ఇడ్లీ (Ragi Idli)
అనేక భారతీయ వంటకాల్లో ఇడ్లీలు ప్రధానమైన అల్పాహారం, సాంప్రదాయ బియ్యంతో చేసే ఇడ్లీలకు బదులు ఇప్పుడు రాగి ఇడ్లీలు ఎక్కువగా ఆస్వాదిస్తున్నా...