![New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన](https://vandebhaarath.com/wp-content/uploads/2023/12/New-Ration-Cards.jpg)
New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..?
కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫాంలను తీసుకు...