Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి రామజన్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే రైలు సర్వీసులు చాలా అందుబాటులోకి వచ్చాయి.అయితే త్వరలో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్లడించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు. అయితే దీనిపై స్పందించిన జోతిరాధిత్య సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడి విమాన సర్వీసు వెంటనే వచ్చేలా చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కొత్త విమాన సేవలు ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) అందుబాటులోకి రానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..