Home » New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
New Ration Cards

New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Spread the love

TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..?

కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫాంలను తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీల లోగో, అప్లికేషన్ ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ… కొత్త రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న రేవంత్ రెడ్డి… ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

READ MORE  Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

రైతు బంధుపై ప్రకటన

రైతుబంధు పథకం (Raithu Bandhu) పై పరిమితులు విధించనున్నామని వస్తు వార్తలు అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతానికి రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి పెట్టలేదన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే రైతు బంధుపై ప్రకటన చేస్తామన్నారు.

READ MORE  TG Raithu Runa Mafi | రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ..

ప్రజలకు సీఎం బహిరంగ లేఖ

ప్రజాపాలన(Paja Palana) కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్.. ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. “ప్రజా పాలనను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు… ఇచ్చిన మాట ప్రకారం.. ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం.. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులందరికీ రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్ష వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది.. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము.’’ అని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

READ MORE  TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్యమూన‌ తేదీలు..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..