Home » Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..
Praja Palana Application Status

Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..

Spread the love

ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లో ‘ప్రజాపాలన'(Prajapalana) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజల వద్దకే వెళ్లి దరఖా స్తులు స్వీకరిస్తున్నామని, అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తు విధానం ఇదే..

  • Prajapalana Application Process : ‘ప్రజాపాలన’ దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిం ది. ఇందులో 4 పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అర్హులు ప్రతీ పథకానికి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పథకం అవసరమని అనుకుంటే దానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఒకవేళ, అన్ని పథకా లకు అర్హులైతే, ఒకే దరఖాస్తులు అన్ని వివరాలు పూరించాలి. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఫొటో ఇవ్వాలి.
    ఇలా చేయండి
    దరఖాస్తు తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు సంఖ్య, మొబైల్ నెంబర్, వృత్తితో పాటు సామాజిక వర్గం వివరాలు నింపాలి. దరఖాస్తుదారుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్ చేయాలి. కింద కుటుంబ సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీలు, వారి ఆధార్ నెంబర్లు, తర్వాత దరఖాస్తుదారు చిరుమానా రాయాలి.
    అనంతరం 5 పథకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ చేయడంతోపాటు అన్ని వివరాలు నింపాలి.
    ‘మహాలక్ష్మి‘ రూ.2,500 ఆర్థిక సహాయం పొందాలంటే అక్కడ కాలమ్ లో టిక్ చేయాలి. ఈ పథకంలో భాగమైన రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్ లబ్ధి కోసం గ్యాస్ కనెక్షన్ సంఖ్య, సిలిండర్ సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారు? అనే వివరాలను నింపాలి.
    ఇక ‘రైతు భరోసా’ పథకం కోసం వ్యక్తి రైతా.? కౌలు రైతా.? అనేది టిక్ పెట్టాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం వంటి వివరాలు రాయాలి. ఒకవేళ దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే, ఉపాధి హామీ కార్డు నంబర్ రాయాలి.
  • ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్ పెట్టాలి. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతో పాటు, అమరుడి పేరు, ఆయన మరణించిన సంవత్సరం, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికెట్ నంబర్ వివరాలు రాయాలి. ఒవకేళ తెలంగాణ ఉద్యమకారులైతే.. ఎదుర్కొన్న కేసుల ఎఫ్ఐఆర్, సంవత్సరం, జైలుకు వెళ్తే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షా కాలం వంటి వివరాలు అందించాలి.
  • ‘గృహజ్యోతి’ పథకం కింద కుటుంబానికి ప్రతీనెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధి పొందాలని అనుకుంటే.. దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్ వినియోగం వివరాలు నింపాలి. ఇందులో 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్లపైన ఈ మూడింటిలో ఒకదాని ఎదురుగా టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య రాయాలి.
READ MORE  Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
  • చేయూత’ పథకం కింద కొత్తగా పెన్షన్ కావాలనుకున్న వారు మాత్రమే దరఖాస్తు చేయాలి.. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు అప్లై చేయనవసరం లేదు. దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్ చేసి సదరం సర్టిఫికెట్ సంఖ్య రాయాలి.. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతువు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, పైలేరియా బాధితులు ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి..
READ MORE  Bhatti Vikramarka | విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..

రశీదు జాగ్రత్త

Prajapalana Application చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ కూడా రాయాలి. అన్ని వివరాలు నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామసభ, వార్డు సభల్లో సమర్పించాలి. దరఖాస్తు ఆఖరి పేజీలో కింది భాగంలో ‘ప్రజాపాలన’ దరఖాస్తు రశీదు ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్సులో టిక్ రాసి, సంబంధిత అధికారి సంతకం చేసి రశీదు ఇస్తారు. దీనిని జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది.

READ MORE  రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..